గుంటూరు బాలిక కేసు : నిందితుడు షేక్ జాన్ సైదా అరెస్ట్

السبت، 5 سبتمبر 2026

Accused Shaik John Saida Arrested Andhra Pradesh currently being brought back to Guntur Guntur Girl Case Superintendent of Police briefed the media on these developments

t f B! P L


గుంటూరు బాలిక కేసులో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. మూడు నెలల నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న కిడ్నాపర్ ను ఎట్టకేలకు పట్టుకున్నారు. బాలికను మాయమాటలతో నమ్మించి బంగారంతో ఉండాయించిన యువకుడు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు బాలిక తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటీషన్ వేశారు. దీంతో న్యాయస్థానం సోమవారంలోపు బాలిక ఆచూకీ కనుగొనాలని, లేకుంటే డీజీపీ న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దీంతో పోలీసులు బృందాలుగా విడిపోయి కిడ్నాపర్ జున్ సైదాతో పాటు బాలికను హర్యానాలో లో పట్టుకున్నారు. ఇద్దరినీ గుంటూరుకు తీసుకు వస్తున్నారు. ఈవిషయం ఎస్పీ మీడియాకు వివరించారు. అయితే తన ఇన్ స్టాగ్రామ్ గ్రామ్ ఖాతా నుంచి చేసిన ఓ మిస్డ్ కాల్ ద్వారా పోలీసులు వారు ఎక్కడున్నది కనిపెట్టారు. గుంటూరు నగరంలో పదో తరగతి చదువుతున్న బాలికను అపహరించిన షేక్ జాన్ సైదా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుడు మూడు నెలల పాటు కాల్స్ చేయకుండా మెసేజ్ లకు ఇన్ స్టా ఖాతాలను వాడటం.. తరచూ స్థావరాలు మారుస్తూ పోలీసులకు దొరక్కుండా సవాల్ విసిరాడు. సిమ్ కార్డులు కూడా పదే పదే మారుస్తుండటంతో పోలీసులకు వీరిని పట్టుకోవడం అసాధ్ంయగా మారింది. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా అతడి కదలికలు గుర్తించి, దర్యాప్తు బృందం అక్కడికి వెళ్లిసరికి తప్పించుకుని ఇతర ప్రాంతాలకు పారిపోతున్నాడు. చివరకు నిందితుడు, బాలిక హరియాణా రాష్ట్రం కర్నాల్ బుధాఖేరాలోని ఓ హోటల్లో ఉన్నట్లు గుర్తించి శుక్రవారం రాత్రి పట్టుకున్నారు.ఇన్ స్టా ఖాతాలు మారుస్తూ...మరోపక్క, బాలిక అదృశ్యంపై ఆమె తండ్రి ఇటీవల హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయగా.. హైకోర్టు ధర్మాసనం పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం రాత్రి బాలిక ఇన్స్టా ఖాతా నుంచి మరోసారి తల్లిదండ్రులకు మిస్డ్ కాల్ వచ్చింది. ఆ వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ అయింది. దాని ఆధారంగా పోలీసు ఐటీ విభాగం దర్యాప్తు ముమ్మరం చేసింది. జాన్ సైదా పదేపదే ఇన్ స్టా ఖాతాలు మారుస్తున్నా అతడి లోకేషన్ గుర్తించారు. దాని ఆధారంగా శుక్రవారం ఉదయాన్నే పోలీసు బృందం హర్యానకు వెళ్లి, స్థానిక పోలీసుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి వారిని తీసుకుని గుంటూరుకు తీసుకు వచ్చారు. ఒక రోజు వ్యవధిలో జాన్ సైదా రెండు ఇన్ స్టా ఖాతాలు మార్చినట్లు గుర్తించారు. మొత్తంగా బాలిక మూడు, జాన్ సైదా ఏడు చొప్పున ఇన్ స్టా ఖాతాలు వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడిని కోర్టులో హాజరు పర్చ నున్నారు. తర్వాత కస్టడీకి తీసుకుని విచారించనున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ