వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టంపై ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి !

الاثنين، 28 سبتمبر 2026

Agriculture Minister Kinjarapu Atchannaidu directs officials Andhra Pradesh Expedite the enumeration of crop losses reviewed the preliminary estimates of crop loss with the officials

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టంపై ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనాలు, ఇప్పటివరకు జరిగిన ఎన్యుమరేషన్ పురోగతిపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి, నష్టపోయిన ప్రతి రైతు వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిన నేపథ్యంలో ఎన్యుమరేషన్‌లో ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఒక్క బాధిత రైతు వివరాలు కూడా నమోదు కాకుండా మిగిలిపోకూడదని, అధికారులు స్వయంగా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. ఉద్యానవన శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 89 మండలాలు, 351 గ్రామాల్లో ఉద్యానవన పంటలు తుఫాన్ ప్రభావానికి గురయ్యాయి. మొత్తం 1,734 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, 5,777 మంది రైతులు నష్టపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటివరకు 445 హెక్టార్లలో 950 మంది రైతులకు సంబంధించిన పంట నష్టం ఎన్యుమరేషన్ పూర్తయింది. ఇంకా 1,289 హెక్టార్లకు సంబంధించిన నష్టం వివరాలను నమోదు చేయాల్సి ఉంది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం 190 మండలాల్లోని 1,229 గ్రామాలు తుఫాన్ ప్రభావానికి గురయ్యాయి. మొత్తం 71,796 మంది రైతులకు పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. సుమారు 44,029 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ఇప్పటివరకు 19 మండలాల్లోని 45 గ్రామాలకు చెందిన 726 మంది రైతుల పంట నష్టం ఎన్యుమరేషన్ పూర్తయింది. ఎన్యుమరేషన్ ప్రక్రియకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల జాయింట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, వ్యవసాయ, ఉద్యానవన అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ నష్టాన్ని గుర్తించాలని చెప్పారు. పంట నష్టం నమోదులో పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని, వాస్తవంగా నష్టపోయిన ప్రతి రైతు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఎన్యుమరేషన్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, జిల్లాల వారీగా, పంటల వారీగా సమగ్ర నష్టం వివరాలను ప్రభుత్వానికి అందించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను అచ్చెన్నాయుడు ఆదేశించారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ