ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో బంగ్లాదేశ్‌కు చెందిన విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. అనంతరం నిందితుడు పారిపోతుండగా భవనం పైనుంచి పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతి కాకినాడలో బిఫార్మసీ చదువుతోంది. అదే కాలేజీకి చెందిన సీనియర్ పరిచయం కావడంతో అచ్యుతాపురంలో అతడితో ఓ గదిలో యువతి ఉంటుంది. కమలేష్ యాదవ్ కూడా అదే భవనంలో అద్దెకు ఉంటున్నాడు. బంగ్లాదేశ్ యువతి రూమ్‌లో ఒంటరిగా కనిపించడంతో ఆమెపై కన్నేశాడు. మరుగు దొడ్లు శుభ్రం చేస్తానని నమ్మించి రూమ్‌లోకి వెళ్లిన అనంతరం ఆమెపై అత్యాచారం చేయబోయాడు. అతడి నుంచి ఆమె తప్పించుకొని బయటకు పరుగులు తీసి కేకలు వేసింది. యువకుడు అక్కడి నుంచి పారిపోతుండగా భవనం పైనుంచి పడి అతడు చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతుడు ఝార్ఖండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
కాకినాడలో బంగ్లాదేశ్ బిఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారయత్నం : పారిపోతూ భవనం పైనుంచి పడి నిందితుడు మృతి
الاثنين، 7 سبتمبر 2026
Accused Dies After Falling from Building While Fleeing Andhra Pradesh Attempted Rape of Bangladeshi B.Pharm Student in Kakinada crime
ليست هناك تعليقات:
إرسال تعليق