స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌తో మోటోరోలా రేజర్ విడుదల

الاثنين، 7 سبتمبر 2026

Created in collaboration with Swarovski and Pantone Motorola Razr Launched with Swarovski Crystals technology this edition focuses heavily on fashion and luxury design

t f B! P L

మోటరోలా  ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్ సిరీస్‌లో స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌తో మోటోరోలా రేజర్ విడుదల చేసింది. స్వరోవ్‌స్కీ క్రిస్టల్ తయారీ సంస్థతో పాటు పాంటోన్ సహకారంతో రూపొందించిన ఈ స్పెషల్ ఎడిషన్ సాధారణ స్మార్ట్‌ఫోన్‌కు భిన్నంగా ఫ్యాషన్, లగ్జరీ డిజైన్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్లో పాంటోన్ మీటియోరైట్ అనే డార్క్ కలర్‌ను ఉపయోగించారు. ఫోన్ వెనుక భాగంలో క్విల్టెడ్, లెదర్ టెక్స్చర్‌తో కూడిన ఫినిష్‌ను అందించారు. దీనిపై సిల్వర్ నైట్ కలర్‌లో 35 స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌ను చేతితో అమర్చారు. ఫోన్‌ను ఓపెన్, క్లోజ్ చేసే సమయంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించేలా హింజ్‌లో 32-ఫేసెట్ స్వరోవ్‌స్కీ క్రిస్టల్‌ను కూడా అమర్చారు.  6.96 అంగుళాల FlexView FHD+ pOLED LTPO డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1080×2640 పిక్సెల్స్ రిజల్యూషన్, 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 120% DCI-P3 కలర్ గామట్, గరిష్ఠంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ బయట భాగంలో 3.63 అంగుళాల QuickView pOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1056×1066 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 1,700 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.  4nm ఆధారిత MediaTek Dimensity 7450X ప్రాసెసర్‌ను ఉపయోగించారు. Mali-G615 MC2 GPU గ్రాఫిక్స్ పనితీరును నిర్వహిస్తుంది. ఇందులో 8GB LPDDR4X RAM, 256GB స్టోరేజ్ ఉన్నాయి. ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాను అందించారు. ఇది f/1.7 అపెర్చర్, OISకు సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. ఇందులో మాక్రో మోడ్ కూడా ఉంది. వీడియోలను గరిష్ఠంగా 4K రిజల్యూషన్‌లో 30fps వద్ద రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఉంటుంది. ఇది f/2.4 అపెర్చర్‌తో వస్తుంది. దీనిలో 4,800mAh బ్యాటరీని అందించారు. ఇది 30W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G SA/NSA, Dual 4G VoLTE, Wi-Fi 6E, Bluetooth 5.4, GPS, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు, Dolby Atmos, USB Type-C ఆడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి. అలాగే IP48 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ