ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్ సంస్థ మేనేజర్‌ను హత్య చేసిన జంట

الأحد، 6 سبتمبر 2026

Couple Murders IIFL Finance Manager crime gujarat Sabarkantha district taken a loan of ₹6 lakh by pledging gold at a finance company

t f B! P L
గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాలో ఒక మహిళ, ఆమె ప్రియుడు కలిసి ఒక ఫైనాన్స్‌ సంస్థలో బంగారాన్ని తాకట్టుపెట్టి రూ.6 లక్షల రుణం తీసుకున్నారు. అయితే ఆ రుణం చెల్లించకుండా తప్పించుకుని తమ బంగారాన్ని వెనక్కి తీసుకునేందుకు వారిద్దరూ కలిసి కుట్రపన్ని ఫైనాన్స్ సంస్థ మేనేజర్‌ను హత్య చేశారు. పోలీసులు ఆ మహిళను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం వెతుకుతున్నారు.  ఈ సంఘటన జరిగింది. ప్రాంతిజ్‌ ప్రాంతానికి చెందిన భావన అలియాస్ భావు ఠాకూర్, యోగేష్ ఠాకూర్ ఏడేళ్లుగా ప్రేమ సంబంధంలో ఉన్నారు. వారిద్దరూ కలిసి ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ సంస్థలో తమ బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టారు. భావన రూ. 1.50 లక్షలు రుణం పొందగా, యోగేష్ రూ. 4.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ జంట కలిసి తీసుకున్న రూ.6 లక్షల రుణాన్ని ఎగ్గొట్టి తమ బంగారాన్ని తిరిగి పొందేందుకు వారిద్దరూ కుట్రపన్నారు. ఆ ఫైనాన్స్‌ సంస్థ బ్రాంచ్‌ మేనేజర్‌ భరత్ చౌదరిని ట్రాప్‌ చేశారు. ఆయనను హత్య చేయాలని ప్లాన్‌ వేశారు. సెప్టెంబర్‌ 2న డబ్బు ఇస్తానని చెప్పి భరత్‌ను ప్రాంతిజ్‌కు రమ్మని భావన కోరింది. దీంతో యోగేష్ తన కారులో భరత్‌ను మన్సా నుంచి తీసుకువెళ్లాడు. వద్వాసాకు వారు చేరుకోగా కారులోనే పదునైన ఆయుధంతో మేనేజర్‌పై దాడి చేశాడు. మెడపై తీవ్ర కత్తి గాయాల వల్ల భరత్‌ మరణించాడు. మరోవైపు ఫైనాన్స్‌ సంస్థ మేనేజర్‌ భరత్‌ను హత్య చేసిన తర్వాత అతడి మృతదేహాన్ని, కారును నిర్మానుష్య ప్రదేశంలో వదిలి వేయాలని భావన, యోగేష్‌ భావించారు. లిమ్లా గ్రామం వైపు వారు ప్రయాణించారు. అయితే కారును రివర్స్ చేస్తుండగా రోడ్డు పక్కన ఉన్న కాలువలో అది ఇరుక్కుపోయింది. అక్కడి నుంచి కారు కదలకపోవడంతో తాము దొరికిపోతామని వారిద్దరూ భయాందోళన చెందారు. భరత్‌ చౌదరి మృతదేహాన్ని కారులో వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. అయితే కారులో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. రెండు రోజుల కిందట అదృశ్యమైన ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ సంస్థ బ్రాంచ్‌ మేనేజర్‌ భరత్‌ చౌదరిగా మృతుడ్ని గుర్తించారు. మెడపై గాయాలు ఉండటంతో పదునైన ఆయుధంతో దాడి చేసి ఆయనను హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు. సాంకేతిక ఆధారాలు, ఫోన్‌ కాల్స్‌ రికార్డుల ఆధారంగా భావన, యోగేష్‌ను నిందితులుగా గుర్తించారు. ఈ హత్య కేసులో భావనను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న యోగేష్‌ను పట్టుకోవడానికి పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ