ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాల వారీగా నమోదైన వర్షపాతం, లోతట్టు ప్రాంతాల పరిస్థితి, తీసుకున్న ముందస్తు చర్యలు, రిజర్వాయర్లు, నదుల్లో నీటి ప్రవాహం తదితర అంశాలపై కలెక్టర్ల నుంచి వివరాలు సేకరించారు. వాయుగుండం ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా ఈ రోజు, రేపు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి సహాయక చర్యలకు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని చెప్పారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రిజర్వాయర్లు, నదుల్లోకి వచ్చే నీటి ప్రవాహాన్ని ముందుగానే అంచనా వేయాలని చంద్రబాబు సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దిగువ ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేయాలని చెప్పారు. రిజర్వాయర్ల నీటి మట్టాలు, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలను నిరంతరం పరిశీలించాలని సూచించారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నప్పుడు ముందుగానే క్షేత్రస్థాయికి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైన చోట్ల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి, అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. తీవ్ర వాయుగుండం గత రాత్రి తీరం దాటిన నేపథ్యంలో రేపు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని సీఎం తెలిపారు. వాయుగుండం తీరం దాటిందని అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని, వర్షాల ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తత కొనసాగించాలని సూచించారు. ఈ రోజు, రేపు కీలకమని పేర్కొన్న సీఎం వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తదనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఎంత మేర పంట నష్టం జరిగిందో క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని ఆదేశించారు. పంట పొలాల్లో నీటి పరిస్థితి, నేలకొరిగిన వరి, కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు జరిగిన నష్టం వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు. వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టాన్ని కచ్చితంగా అంచనా వేసి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావం ఉన్న జిల్లాల్లో రేపు కూడా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యార్థులు, చిన్నారులు వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు.
కలెక్టర్లతో సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
الخميس، 24 سبتمبر 2026
and medicines for the public Andhra Pradesh CM Chandrababu holds a teleconference with District Collectors Ensure availability of food Impact of the severe depression water
ليست هناك تعليقات:
إرسال تعليق