ఆసియా క్రీడలు : క్వార్టర్ ఫైనల్‌లో పివి సింధు ఓటమి : షెడ్యూల్ నిర్వహణపై ఆగ్రహం
الأحد، 27 سبتمبر 2026
Asian Games Frustration Over Schedule Management matches were held in quick succession without allowing for adequate rest national PV Sindhu Loses in Quarter-finals sports
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పివి సింధు క్వార్టర్ ఫైనల్‌లో చెన్ యూ ఫీ (చైనా) చేతిలో 11-12, 21-18, 21-10 తేడాతో ఓడిపోయారు. అనంతరం సింధు మాట్లాడుతూ ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ షెడ్యూల్ నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తగినంత విశ్రాంతి సమయం ఇవ్వకుండా వెను వెంటనే మ్యాచ్‌లు నిర్వహించారని పేర్కొన్నారు. 24 గంటల వ్యవధిలో మూడు సింగిల్స్ మ్యాచ్‌లు నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ''24 గంటల వ్యవధిలో మూడు మ్యాచ్‌లు ఆడడం అనేది కేవలం మానసిక సన్నద్ధతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. సుదీర్ఘమైన మ్యాచ్‌లు జరిగినప్పుడు కచ్చితంగా శరీరానికి విశ్రాంతి అవసరం. ఆటలో మంచి స్థితిలో ఉన్నప్పటికీ విశ్రాంతి లేకపోవడం వల్ల అలసటతో కాళ్లు కదలవు. నేను మెరుగైన ఆట తీరు కనబర్చానని అనుకుంటున్నాను. కానీ, మ్యాచ్‌ల నిర్వహణ సమయాలు మరింత మెరుగ్గా ఉంటే బాగుండేది'' అని సింధు పేర్కొన్నారు.
ليست هناك تعليقات:
إرسال تعليق