విల్లా ప్రాజెక్ట్ పేరుతో మహిళ నుంచి రూ. 79 లక్షలు వసూలు చేసిన బిల్డర్ : భారీ జరిమానా విధిస్తూ కఠిన చర్యలు తీసుకున్న రెరా
Tuesday, September 22, 2026
Builder Collected ₹79 Lakhs from Woman for Villa Project Despite the absence of any legal clearances or layout approvals RERA Takes Strict Action and Imposes Heavy Fine telangana
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మోసపూరిత బిల్డర్లపై మరో సంచలన తీర్పు వెలువరించింది. సరైన అనుమతులు లేని విల్లా ప్రాజెక్ట్ పేరుతో ఓ అమాయక మహిళ నుంచి రూ. 79 లక్షలు భారీగా వసూలు చేసి, ఆపై నిర్మాణం పూర్తి చేయకుండా చేతులెత్తేసిన ఓ కేటుగాడికి వ్యతిరేకంగా బాధితురాలికి అనుకూలంగా తీర్పునిచ్చింది. చట్ట నిబంధనలను ఉల్లంఘించి వినియోగదారులను మోసం చేసిన ఆ బిల్డర్‌కు భారీ జరిమానా విధిస్తూ రెరా కఠిన చర్యలు తీసుకుంది. ఎలాంటి చట్టపరమైన అనుమతులు, లేఅవుట్ అప్రూవల్స్ లేకపోయినా ఆకర్షణీయమైన ప్రకటనలతో సదరు బిల్డర్ విల్లా ప్రాజెక్ట్‌ను విక్రయిస్తున్నట్లు నమ్మించాడు. దీనిని నిజమని నమ్మిన బాధితురాలు విల్లా కొనుగోలు నిమిత్తం విడతలవారీగా మొత్తం రూ. 79 లక్షలను ఆ సంస్థకు చెల్లించింది. అయితే డబ్బులు తీసుకున్నప్పటికీ ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగకపోగా, కనీస నిర్మాణాలు కూడా పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ రెరాను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదును అత్యంత సీరియస్‌గా పరిగణించిన టీఎస్‌రెరా అధికారులు ఇరువర్గాల వాదనలను విచారించి సమగ్ర దర్యాప్తు జరిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ చేపట్టడం, డబ్బులు వసూలు చేసి మోసం చేయడం నిరూపితం కావడంతో రెరా చట్టం ప్రకారం బిల్డర్‌ను దోషిగా తేల్చారు. బాధితురాలి నుంచి వసూలు చేసిన అసలు మొత్తం రూ. 79 లక్షలను, ఎలాంటి జాప్యం లేకుండా చెల్లించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆ మొత్తంపై కాలయాపన చేసినందుకు గాను వార్షికంగా 10.7 శాతం వడ్డీని కలిపి బాధితురాలికి తిరిగి చెల్లించాలని రెరా తన తీర్పులో తేల్చిచెప్పింది.
No comments:
Post a Comment