అక్టోబర్ 21 నుంచి 'వాయిస్ కాలింగ్, ఎస్‌ఎంఎస్'లతో కూడిన చౌకైన రీఛార్జ్ ప్లాన్ల ప్లాన్లు : భారత టెలికాం నియంత్రణ సంస్థ ఆదేశాలు జారీ

Thursday, September 24, 2026

business effective October 21 featuring only voice calling and SMS national technology telecom TRAI issues orders for affordable recharge plans

t f B! P L

క్టోబర్ 21 నుంచి కేవలం 'వాయిస్ కాలింగ్, ఎస్‌ఎంఎస్'లతో కూడిన చౌకైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తేవాలని భారత టెలికాం నియంత్రణ సంస్థ  ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం టెలికాం కంపెనీలు అందిస్తున్న 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీ గల రెగ్యులర్ డేటా ప్లాన్లతో సమానంగా, డేటా లేని కాలింగ్ ప్లాన్లను సైతం మార్కెట్లోకి తేవాల్సిందేనని ట్రాయ్ ఆదేశించింది. వీటితో పాటు కనీసం ఒక లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టాలి. వీటన్నింటిలో వినియోగదారులకు లభించే అతిపెద్ద ఉపశమనం వ్యాలిడిటీ టైం. ప్రతినెలా ఒకే తేదీన ప్లాన్ రెన్యూ అయ్యేలా ఈ సరికొత్త ప్లాన్లు ఉండనున్నాయి. ఉదాహరణకు ఒక నెలలో 10వ తేదీన రీఛార్జ్ చేసుకుంటే, మరుసటి నెలలో కూడా 10వ తేదీ వరకే ఆ ప్యాక్ వర్తిస్తుంది. 31వ తేదీ లేని నెలల్లో ఆ నెల చివరి రోజే గడువు ముగుస్తుంది. దీంతో పరోక్షంగా కంపెనీలు చేస్తున్న రోజుల కోతకు తెరపడనుంది. నో డేటా రీఛార్జ్ ప్యాక్ ధరల్లో గణనీయమైన తగ్గింపు ఉండాలని ట్రాయ్ తేల్చిచెప్పింది. కంపెనీలు తమ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ప్రాతిపదికన ధరలను నిర్ధారించాలని సూచించింది. గణాంకాల ప్రకారం.. ఒకప్పుడు జీబీ డేటాపై కంపెనీలకు సగటున రూ. 9.11 వచ్చేది, ప్రస్తుతానికది రూ. 7.51కి తగ్గింది. అయినప్పటికీ వినియోగదారులు ఎక్కువగా ఇంటర్నెట్ వాడుతుండటంతో సగటు బిల్లు రూ.183 నుంచి రూ.196.04కి పెరిగింది. ఇప్పుడు డేటా రహిత ప్లాన్లు అమల్లోకి వస్తే, ఇంటర్నెట్ వాడని సాధారణ వర్గాల నెలవారీ ఖర్చు భారీగా ఆదా కానుంది. గతంలో డిసెంబర్ 2024లోనే కేవలం కాలింగ్ ఉండే 365 రోజుల వోచర్లను తేవాలని ట్రాయ్ చెప్పినప్పటికీ, టెలికాం సంస్థలు చిట్కాలు ప్రయోగించాయి. తక్కువ వ్యాలిడిటీ ప్లాన్లను పక్కనపెట్టి, ఎక్కువ ధరలతో కూడిన ప్యాక్స్ మాత్రమే ఇచ్చాయి. దీనిపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏప్రిల్ 2026లో డ్రాఫ్ట్ రూపొందించి, జూన్ 15న విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాతే ట్రాయ్ ఈ సరికొత్త నిబంధనలను ఖరారు చేసింది. కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. ప్రజల ప్రయోజనాలే పరమావధిగా అక్టోబర్ 21 నుంచి ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ట్రాయ్ ఆదేశించింది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ