నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలు : పలు ప్రాంతాలను ముంచెత్తుతున్న వరదలు : 21 మంది మృతి, ఐదుగురు గల్లంతు

الاثنين، 28 سبتمبر 2026

21 Dead Five Missing Floods Inundate Several Areas Heavy Rains in Nepal international September 24 and 27 due to the adverse weather and flooding

t f B! P L

నేపాల్‌లో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో నేపాల్ వ్యాప్తంగా కనీసం 21 మంది మరణించారని, ఐదుగురు గల్లంతయ్యారని, మరో ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం, వరదల కారణంగా సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు సుమారు 3,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చిందని చెప్పారు. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల అనేక ఇళ్లు ధ్వంసం కావడం, దెబ్బతినడం జరిగింది. సెంట్రల్ నేపాల్‌లోని నారాయణి నది ఆదివారం తొమ్మిది మీటర్ల ప్రమాద స్థాయిని దాటి జనావాసాల్లోకి ప్రవేశించింది. ఇక, పలు జాతీయ రహదారులపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు నది పరివాహక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో వాటి ప్రవాహాలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో నది తీరంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి ఎగువ పరివాహక ప్రాంతాల ప్రజలు, దిగువ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నేపాల్‌లో ఇప్పటికీ వర్షాలు కొనసాగుతుండటంతో మరిన్ని వరదలు సంభవించే, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 77 జిల్లాల్లో 49 జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రధాన నదులు, ఉపనదులలో నీటి మట్టాలు పెరుగుతుండటంతో సగం కంటే ఎక్కువ జిల్లాలు తీవ్రమైన వరద లేదా ఆకస్మిక వరదల ముప్పును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. మనంగ్, ముస్తాంగ్, మ్యాగ్డి, బాగ్లుంగ్ జిల్లాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు కృషి చేస్తున్నారని ఇంధన శాఖ అధికారులు తెలిపారు. రాహు గంగా నదికి వచ్చిన వరదల కారణంగా 40 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం, విద్యుత్ ప్రసార లైన్ టవర్లు దెబ్బతిన్నాయని నీటి వనరులు మరియు ఇంధన శాఖ మంత్రి బిరాజ్ భక్త శ్రేష్ఠ తెలిపారు. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్, విద్యుత్ సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని సమాచార శాఖ మంత్రి విక్రమ్ తిమిల్సిన్హా చెప్పారు. దీంతో టెలికమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ