ホーム
/
stock market
/
ఐబీఎం క్లౌడ్ నుంచి కీలక ఆర్డర్ : 15 శాతం లాభంతో ట్రేడవుతున్న బ్లూక్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ షేర్
الجمعة، 25 سبتمبر 2026
BlueCloud Softech Solutions Shares Trade 15% Higher business contract is valued at ₹147 crore Key Order from IBM Cloud stock market
అమెరికా కంపెనీ ఐబీఎం క్లౌడ్ నుంచి కీలక ఆర్డర్ లభించ డంతో హైదరాబాద్‌కు చెందిన బ్లూక్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ షేర్ ఇవాళ 15 శాతం లాభంతో రూ.22.98 వద్ద ట్రేడవుతోంది. ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిజైన్, డిప్లాయ్మెంట్, సపోర్ట్ సర్వీస్‌లను తమ అమెరికా అనుబంధ కంపెనీ గ్లోబల్ ఇంపెక్స్ ఇన్‌కార్పొరేటెడ్ అందిస్తుందని బ్లూక్లౌడ్ సాఫ్ట్‌టెక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ఈ కాంట్రాక్ట్ విలువ రూ. 147 కోట్లుగా కంపెనీ పేర్కొంది. తాజా ఆర్డర్‌తో కంపెనీ వద్ద ఉన్న ఆర్డర్ల విలువ రూ. 1400 కోట్లను దాటనుందని కంపెనీ పేర్కొంది. త్రైమాసిక ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా 12.26 శాతం నుంచి 20.38 శాతానికి పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.
ليست هناك تعليقات:
إرسال تعليق