విధుల్లో ఉన్న బ్లూ కోర్ట్ కానిస్టేబుళ్లను ఢీ కొట్టిన కారు : ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు
الجمعة، 25 سبتمبر 2026
Car Rams into On-Duty Blue Colt Constables; Two Injured crime Karimnagar launched an effort to apprehend the accused based on the car's details telangana
తెలంగాణలోని కరీంనగర్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో విధుల్లో ఉన్న త్రీ టౌన్ బ్లూ కోర్ట్ కానిస్టేబుళ్లను ఢీ కొట్టింది. ప్రమాదంలో శివ, రత్నం అనే ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ పోలీసులను స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శివ అనే కానిస్టేబుల్ కు కాలు విరగడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా రత్నం అనే కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. కాగా ఈ ప్రమాదానికి నగరంలోని సుభాష్ నగర్ కు చెందిన ఓ వ్యక్తికి చెందిన హుండాయ్ క్రెటా కారుగా పోలీసులు గుర్తించారు. కారు వివరాల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ليست هناك تعليقات:
إرسال تعليق