హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం వద్ద కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు 'కాంగ్రెస్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఈ ఆందోళన చేపట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అమిత్ షా దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. అనంతరం, బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో, ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా.. వారితో వాగ్వాదం జరిగింది.
ホーム
/
Youth Congress activists attempt to lay siege to BJP office in protest against the insult to Mallikarjun Kharge
/
మల్లికార్జున ఖర్గేను అవమానించడాన్ని నిరసిస్తూ : బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు
الاثنين، 31 أغسطس 2026
hyderabad telangana Youth Congress activists attempt to lay siege to BJP office in protest against the insult to Mallikarjun Kharge
ليست هناك تعليقات:
إرسال تعليق