ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్‌ఆర్‌టీసీ డిసెంబర్ నాటికి 1,050 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకురానుంది. దేశ వ్యాప్తంగా కాలుష్యాన్ని నియంత్రించటం కోసం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఈ-బస్ సేవా పీఎం ఈ-బస్ సేవా సేవా పథకం కింద ఈ బస్సులు కేటాయించబడ్డాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సులు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, అమరావతి, కాకినాడ, రాజమహేంద్రవరం, అనంతపురం, నెల్లూరు, కర్నూలు, కడప వంటి ప్రధాన నగరాల్లో నడవనున్నాయి. వీటిలో 12 మీటర్ల, 9 మీటర్ల పొడవు గల బస్సులు ఉన్నాయి. ఈ చర్య వల్ల డీజిల్ వాహనాల వల్ల కలిగే కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ప్రజలలో ఈవీ వాహనాల వాడకం కూడా బాగా పెరుగుతుంది. వాయు కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని తగ్గించే ఈ బస్సుల ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, నిశ్శబ్ద ప్రయాణం అందుతుంది. చార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం బస్ స్టేషన్లు, డిపోల వద్ద పనులు జరుగుతున్నాయి. విద్యుత్ సబ్‌స్టేషన్లు, లైన్లు వేసే పనులు కూడా చేపట్టారు. ఆర్టీసీ నిర్వహించే ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం భవిష్యత్తులో కొత్తగా కొనుగోలు చేసే అన్ని బస్సులు ఎలక్ట్రిక్‌గా ఉండాలని నిర్ణయించింది. పల్లె వెలుగు సర్వీసుల్లో కూడా ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్త్రీ శక్తి పథకం కింద మహిళలు ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం తో ఆర్టీసీ పర్యావరణ హిత రవాణా వైపు పెద్ద ముందడుగు వేస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా ఇది దోహదపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం దశలవారీగా అమలవుతుంది. మొత్తం 5500 ఎలక్ట్రిక్ బస్సులు దశల వారీగా ఏపీకి తీసుకురావాలని భావిస్తోంది. మళ్ళీ త్వరలో డిసెంబర్ నాటికి 1,050 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకురానున్నారు. ఇది ఏపీ ప్రజలకు నిజంగా సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించే ఒక ముందడుగు.
ホーム
/
Visakhapatnam
/
డిసెంబర్ నాటికి ఏపీఎస్ఆర్టీసీలో రోడ్లపైకి తీసుకురానున్న 1,050 ఎలక్ట్రిక్ బస్సులు
الاثنين، 31 أغسطس 2026
050 Electric Buses by December amaravati anantapur Andhra Pradesh APSRTC to Deploy 1 guntur kadapa kakinada Kurnool Nellore Rajamahendravaram Tirupati VIJAYAWADA Visakhapatnam
ليست هناك تعليقات:
إرسال تعليق