మహారాష్ట్ర వ్యాప్తంగా గేదె పాల ధరలు భారీగా పెరగనున్నాయి. బొంబాయి పాల ఉత్పత్తిదారుల సంఘం టోకు ధరను లీటరుకు రూ.9 నుంచి రూ.102కు చేర్చింది. దీని ప్రభావంతో రిటైల్ మార్కెట్లో ప్రాంతాన్ని బట్టి లీటరు గేదె పాల ధర రూ. 110 నుంచి రూ.112 వరకు చేరనుంది. ముఖ్యంగా దక్షిణ ముంబై ప్రాంతవాసులు అత్యధికంగా రూ.112 చెల్లించాల్సి వస్తుంది. ఈ పెంచిన టోకు ధర సవరణ 2027 ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుందని పాల ఉత్పత్తిదారుల సంఘం స్పష్టం చేసింది. పశువుల మేత, ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని ఉత్పత్తిదారులు వెల్లడించారు. గడిచిన ఏడాది కాలంలో ధాన్యం, కంది చుని, శనగ చుని, మొక్కజొన్న, పచ్చి మేత ధరలు దాదాపు 25 శాతం వరకు పెరిగాయి. దీనికి తోడు ఇంధనం, రవాణా, కార్మికుల కూలీ, నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి. ప్రస్తుతం ఒక లీటరు పాలు ఉత్పత్తి చేయడానికి రూ.98 వరకు ఖర్చు అవుతోందని, పాత రేట్లతో నష్టాలు వస్తున్నాయని వారు వివరించారు. ముంబైలో ప్రతిరోజూ దాదాపు 40 లక్షల లీటర్ల గేదె పాలు విక్రయం అవుతుండటంతో ఈ ధరల సవరణ నిర్ణయానికి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సవరణ ప్రకారం టోకు ధర రూ.93 నుంచి రూ.102కి పెరిగింది. రిటైల్ విభాగంలో దక్షిణ ముంబై ప్రాంతంలోని తబేలా పాలు లీటరు రూ.104 నుంచి రూ.112కి పెరగగా, ముంబైలోని ఇతర ప్రాంతాల్లో రూ.100 నుంచి రూ.110కి చేరాయి. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా గోకుల్ ప్యాకెట్ గేదె పాల ధర ఆగస్టులోనే లీటరుకు రూ.76 నుంచి రూ.78కి పెరిగి అమల్లో ఉంది.
మహారాష్ట్రలో సెప్టెంబర్ 1 నుంచి పాల ధరలు పెంపు
الاثنين، 31 أغسطس 2026
Bombay Milk Producers' Association has raised the wholesale price to ₹102 per liter buffalo milk will range from ₹110 to ₹112 per liter Milk Prices to Rise in Maharashtra from September 1 national
ليست هناك تعليقات:
إرسال تعليق