మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంలో ఈజిప్టు చేరుతుందని తుర్కియే ఆశాభావం వ్యక్తం చేసింది. సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్తాన్ శుక్రవారం ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈజిప్టు చేరేందుకు కొన్ని సాంకేతిక, విధానపరమైన అంశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ తెలిపారు. అమెరికా -ఇరాన్ మధ్య యుద్ధం ప్రభావం పశ్చిమాసియాపై కొనసాగుతున్న సమయంలో ఈ ఒప్పందం కుదిరింది. హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రంలో నౌకాయానం అంతరాయాలకు గురవుతున్న నేపథ్యంలో మూడు దేశాలు పరస్పర రక్షణకు ఈ ఒప్పందం చేసుకున్నాయి.ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై దాడి జరిగితే, అది మిగతా రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 51 ప్రకారం వ్యక్తిగత, సమష్టి ఆత్మరక్షణ హక్కును ఈ ఒప్పందం గుర్తిస్తుంది. బాహ్య దాడులను నిరోధించేలా పరస్పర నిరోధక శక్తిని పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ రక్షణ ఒప్పందం ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకుని కుదుర్చుకున్నది కాదని ఫిదాన్ స్పష్టం చేశారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఈ ఒప్పందం కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మూడు దేశాలతోనే కూటమిని పరిమితం చేయకూడదని ఫిదాన్ అన్నారు. అవసరమైతే మరిన్ని దేశాలను ఈ రక్షణ వ్యవస్థలోకి తీసుకురావాలని తుర్కియే అధ్యక్షుడి ఆలోచనగా తెలిపారు. అమెరికా, -ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది.
మక్కా రక్షణ ఒప్పందంలోకి ఈజిప్టు : ఆశాభావం వ్యక్తం చేసిన తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్
Monday, August 10, 2026
and Pakistan signed the agreement Egypt to Join Mecca Defense Pact international Saudi Arabia Turkish Foreign Minister Hakan Fidan Expresses Optimism Türkiye
No comments:
Post a Comment