భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వోడాఫోన్ ఐడియా చేతులు కలిపింది. ఈ రెండు కంపెనీల మధ్య జరిగిన కీలకమైన ‘నెట్‌వర్క్ షేరింగ్ ఒప్పందం’ వల్ల నెట్‌వర్క్ కవరేజ్ మరింత బలోపేతం కానుంది. ఈ భాగస్వామ్యంతో యూజర్లకు మెరుగైన కవరేజ్ లభించడమే కాకుండా BSNL 5G సేవల రాకకు దారి సుగమం కానుందా అనే చర్చ ప్రారంభమైంది. తమ టవర్లను, నెట్‌వర్క్ మౌలిక వసతులను పంచుకుంటాయి. దీనివల్ల Vi టవర్లు ఉన్నచోట BSNL సిగ్నల్, BSNL నెట్‌వర్క్ బలంగా ఉన్న ప్రాంతాల్లో Vi యూజర్లకు మెరుగైన సిగ్నల్ లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాలు, సరిహద్దు పరిసరాల్లో బిఎస్ఎన్ఎల్ కవరేజ్ బలంగా ఉండగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో Vi మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి. ఈ ఒప్పందంతో రెండు కంపెనీల వినియోగదారులకు నెట్‌వర్క్ లోపాలు లేకుండా సేవలు అందుతాయి. ముఖ్యంగా రీఛార్జ్ ధరలు పెరిగిన తర్వాత BSNL వైపు మొగ్గు చూపిన వినియోగదారులకు ఇండోర్ కవరేజ్, డేటా స్పీడ్ పరంగా ఎదురవుతున్న సమస్యలకు ఈ నిర్ణయం పెద్ద ఊరట నివ్వనుంది. ఈ నెట్‌వర్క్ షేరింగ్ డీల్ వల్ల BSNL 5G వేగవంతం కానుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం BSNL దేశవ్యాప్తంగా తన 4G నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఈ 4G టవర్లను త్వరలోనే 5G కి అప్‌గ్రేడ్ చేసే విధంగా స్వదేశీ సాంకేతికతతో రూపకల్పన చేస్తున్నారు. Vi ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 5G ట్రయల్స్, విస్తరణపై దృష్టి పెట్టడంతో ఈ భాగస్వామ్యం ద్వారా BSNL కూడా తన యూజర్లకు త్వరలోనే 5G అనుభవాన్ని అందించేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.
ホーム
/
technology
/
చేతులు కలిపిన బీఎస్‌ఎన్‌ఎల్, వోడాఫోన్ ఐడియా !
الأحد، 30 أغسطس 2026
BSNL and Vodafone Idea Join Hands companies will share their towers and network infrastructure national network sharing agreement technology
ليست هناك تعليقات:
إرسال تعليق