బిట్‌కాయిన్‌ ఆసియా 2026 సదస్సు : బిట్‌కాయిన్ విలువ భవిష్యత్తులో మిలియన్‌ డాలర్లకు చేరడం ఖాయం

الأحد، 30 أغسطس 2026

Binance founder Changpeng Zhao Bitcoin Asia 2026 Conference Bitcoin Value Certain to Reach $1 Million in the Future business

t f B! P L

ఒక్కో బిట్‌కాయిన్ విలువ భవిష్యత్తులో 1 మిలియన్‌ డాలర్లకు (ప్రస్తుత మారక విలువ ప్రకారం సుమారు రూ.9.5 కోట్లు) చేరడం ఖాయమని, ఇందుకు 25 ఏళ్లు పట్టకపోవచ్చని బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావో అభిప్రాయపడ్డారు. ఇటీవల హాంకాంగ్‌లో జరిగిన బిట్‌కాయిన్‌ ఆసియా 2026 సదస్సులో 'బిట్‌కాయిన్‌ శతాబ్ధి' పేరుతో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే బిట్‌కాయిన్‌ను కేవలం ధర ఆధారంగా అంచనా వేయడం సరికాదని చాంగ్‌పెంగ్ జావో స్పష్టం చేశారు. రాబోయే దశాబ్దంలో దాని వినియోగం, చెల్లింపుల్లో వినియోగం, సంస్థాగత స్వీకరణ భారీగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద ఎత్తున బిట్‌కాయిన్ చెల్లింపులు జరగడం, రిటైర్మెంట్ ఫండ్లు, పెన్షన్ ఫండ్లు, పెట్టుబడి నిధులు, ప్రభుత్వాల రిజర్వ్ ఆస్తుల్లో బిట్‌కాయిన్‌కు స్థానం లభించడం వంటి పరిణామాలు కీలక మైలురాళ్లుగా మారతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో బిట్‌కాయిన్ ప్రాధాన్యత బంగారాన్ని మించే అవకాశం ఉందని చాంగ్‌పెంగ్ జావో అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తదుపరి బుల్‌ మార్కెట్‌లో బిట్‌కాయిన్ మార్కెట్ విలువ పరంగా బంగారాన్ని అధిగమించవచ్చని ఆయన పేర్కొన్నట్లు ది బ్లాక్ నివేదించింది. అయితే ప్రస్తుతం ఈ రెండింటి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇటీవలి మార్కెట్ డేటా ప్రకారం బిట్‌కాయిన్ ధర ఆగస్టు చివర్లో సుమారు 80,000 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఆగస్టు 25న ఇది 80,600 డాలర్ల ప్రాంతాన్ని తాకింది. దీంతో 1 మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరాలంటే ప్రస్తుత స్థాయి నుంచి బిట్‌కాయిన్ దాదాపు 12 రెట్లు పెరగాల్సి ఉంటుంది. క్రిప్టో రంగంలో వచ్చే పదేళ్లలో కేవలం బిట్‌కాయిన్ మాత్రమే కాకుండా స్టేబుల్‌కాయిన్లు, టోకెనైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని సీజెడ్‌ అంచనా వేశారు. టోకెనైజ్డ్ ఆస్తులు, డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరించడంతో సంప్రదాయ ఆర్థిక వ్యవస్థతో క్రిప్టో రంగం అనుసంధానం మరింత బలపడుతుందని ఆయన అన్నారు. బిట్‌కాయిన్ ప్రధానంగా దీర్ఘకాలిక పొదుపు, రిజర్వ్ ఆస్తిగా ఎదగవచ్చని, మరోవైపు స్టేబుల్‌కాయిన్లు రోజువారీ చెల్లింపులు, ట్రేడింగ్, అలాగే AI ఏజెంట్ల మధ్య జరిగే మెషిన్-టు-మెషిన్ లావాదేవీల్లో కీలకంగా మారవచ్చని ఆయన వివరించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ