తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై మెటా ఆంక్షలు విధించిందని, భారత్‌లోని వినియోగదారులకు తన ప్రొఫైల్ అందుబాటులో లేకుండా పోయిందని జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. కేవలం భారతదేశంలోనే తన ఇన్‌స్టా ఖాతాపై పరిమితులు విధిస్తున్నారని, దీనిపై మెటా ప్రతినిధులకు ఎన్ని ఈ-మెయిల్స్ పంపినా కేవలం ఆటోమేటెడ్ రెస్పాన్స్ వస్తోంది తప్ప స్పష్టమైన కారణం చెప్పడం లేదని కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు. "మీ ఆఫీస్‌లో ఉన్నవారు ఎవరూ దీనికి స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. ఆంక్షలు ఎలా తొలగించాలో కూడా సూచించడం లేదు. మీ సేవలు చాలా చెత్తగా ఉన్నాయి" అని ఎక్స్ వేదికగా ఆయన దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న E20 (20 శాతం ఇథనాల్ కలిపిన) పెట్రోల్ విధానం వాహనాలపై చూపే ప్రతికూల ప్రభావాల గురించి, దానిపై వెలువడిన నివేదికల గురించి తాను వరుసగా పోస్టులు పెడుతుండటంతోనే తన ఖాతాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ఒక వీడియో ఫేస్‌బుక్‌లో కొద్దిసేపు నిలిచిపోవడంతో మెటా గ్లోబల్ టీమ్ కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పిన విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించారు. "ప్రధాని మోడీ ముందు మెటా అంతలా తలవొంచాల్సిన అవసరం లేదు. లేకపోతే భవిష్యత్తులో భారత్‌లో కేవలం ఆయన ఒకరి ఖాతాను మాత్రమే నడపడానికి మిమ్మల్ని అనుమతిస్తారు" అంటూ కేంద్రంపై మరియు మెటాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ホーム
/
technology
/
భారత్ లోని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై పరిమితులు విధిస్తున్నారు : మెటాపై అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణ
الخميس، 6 أغسطس 2026
Arvind Kejriwal Accuses Meta of Restricting His Instagram Account in India national sending multiple emails to Meta representatives technology
ليست هناك تعليقات:
إرسال تعليق