వర్షాలు కురవద్దంటూ క్షుద్రపూజలు చేశానని కాంగ్రెస్ నేతలు నిందలు వేయడం సిగ్గుచేటు !

الخميس، 6 أغسطس 2026

Former Minister Harish Rao It is shameful for Congress leaders to accuse me of performing occult rituals to prevent rainfall Speaking to the media in Hyderabad telangana

t f B! P L

హైదరాబాద్ లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ ఈ ఆధునిక యుగంలో కూడా రాష్ట్రంలో వర్షాలు కురవద్దంటూ తాను క్షుద్రపూజలు చేశానని కాంగ్రెస్ నేతలు తనపై నిందలు వేయడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయాల్లో విమర్శలకు కూడా ఓ హద్దంటూ ఉంటుందని, బట్టకాల్చి మీదేస్తే తాను ఊరుకునే రకం కాదని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హరీశ్ రావు హెచ్చరించారు. గతంలో కూడా మంత్రి కొండా సురేఖ ఇలాగే నోటికొచ్చినట్లుగా మాట్లాడి ఇవాళ నాంపల్లి కోర్టుచుట్టూ తిరుగుతా ఉన్నారని హరీశ్ రావు అన్నారు. క్షుద్రపూజల ఆరోపణ అంశంలో ఇష్టం వచ్చిన మాట్లాడిన కాంగ్రెస్ నేతలపై క్రిమినల్ సూట్, పరువు నష్టం కేసును వేయబోతున్నానని, ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చానని అన్నారు. మెయిల్ లీగల్ యాక్షన్‌కు ఇంకా 30 రోజుల టైమ్ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు, స్కాములను ఎత్తిచూపుతున్న నేపథ్యంలోనే రాజకీయంగా ఎదుర్కోలేక తనపై బురదజల్లేందుకు, డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ నేతలు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మైనింగ్ స్కామ్, నాదర్‌గుల్ భూముల వ్యవహారం, గురుకుల టెండర్ల అవినీతి బయటపెట్టామనే ఆక్రోశంలో ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతాంగం నీళ్లు లేక అల్లాడుతుంటే.. దేవాదులలో పది మోటార్లు ఉన్నా నేటికీ నాలుగు మోటార్లు మాత్రమే నడుస్తున్నాయని ఆరోపించారు. ప్రజల హక్కులు, రైతాంగం, విద్యార్థుల పక్షాల తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని తగ్గేదేలేదని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ