ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో మైన్స్ శాఖలో సర్వేయర్‌గా పనిచేస్తున్న మురళీకృష్ణ అంబేద్కర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడు సందిన సునీల్ వద్ద నుంచి తన పని చేసేందుకు మురళీకృష్ణ అంబేద్కర్ మొత్తం రూ.15 లక్షలు లంచంగా డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు బాధితుడు రూ.5 లక్షలు అందజేస్తుండగా సర్వేయర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
إرسال تعليق