పాఠశాల ప్రహరీ గోడ కూలి పదో తరగతి విద్యార్థి మృతి : మరో విద్యార్థికి తీవ్ర గాయాలు

Tuesday, August 18, 2026

Andhra Pradesh Another Critically Injured Class 10 Student Dies After School Boundary Wall Collapses ZP High School in Parvathipuram Manyam district

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ ఒక్కసారిగా కుప్పకూలడంతో పదో తరగతి విద్యార్థి తుపాకుల అరుణ్ తేజ (15) అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొక విద్యార్థి యాకూబ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. మధ్యాహ్న భోజనం ముగిసిన అనంతరం విద్యార్థిలిద్దరూ ప్రహరీ గోడపై కూర్చొని మాట్లాడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం ఇవ్వడంలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుడి బంధువులు, స్థానికులు మృతదేహంతో పాఠశాల వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి సంధ్యారాణితో మాట్లాడి ప్రమాద వివరాలను సేకరించిన ఆయన, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల తక్షణ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన విద్యార్థి యాకూబ్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించడమే కాకుండా, మృతుడి కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ