హైదరాబాద్‌లో తొలి ఔట్‌లెట్ ను ప్రారంభించిన జర్మన్ డోనర్ కబాబ్

Tuesday, August 18, 2026

business GBC India is operating as the master franchise partner in the country German Doner Kebab Launches First Outlet in Hyderabad national telangana

t f B! P L

దేశంలో తొలి ఔట్లెట్ ను హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ లో జర్మన్ డోనర్ కబాబ్ ప్రారంభించింది. భారత్ లో  మాస్టర్ ఫ్రాంచైజీ భాగస్వామిగా జీబీసీ ఇండియా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన కార్యకలాపాలను దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించింది. దీర్ఘకాలంలో భారత్ లో  450కి పైగా రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత ఔట్లెట్లతో పాటు ఫ్రాంచైజీ విధానంలోనూ రెస్టారెంట్లను ఏర్పాటు చేయనుంది. భారత్ లో  కేవలం రెస్టారెంట్ చైన్ ను ఏర్పాటు చేయడం కాకుండా డోనర్ ఫుడ్ కేటగిరీని మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని జర్మన్ డోనర్ కబాబ్ ఇండియా సీఈఓ విక్రాంత్ తోమర్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డోనర్ అనుభవాన్ని భారతీయ వినియోగదారులకు అందించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో  తొలి ఔట్లెట్ అనంతరం మొహాలి, చండీగడ్ తో  పాటు ఇతర టియర్-1, టియర్-2 నగరాల్లో కార్యకలాపాలను విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది. రుచి, తాజాదనం, నాణ్యతతో పాటు ప్రోటీన్ ఆధారిత ఆహార ఎంపికలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. భారత్ లో యువతను ఆకట్టుకునేలా సంగీతం, ఫ్యాషన్, క్రీడలు, ఫిట్నెస్, వినోదంతో బ్రాండ్ను అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. ప్రముఖ సంగీత కళాకారుడు, నటుడు, దర్శకుడు పర్మిష్ వర్మను సాంస్కృతిక భాగస్వామిగా నియమించుకున్నట్లు వెల్లడించింది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ