పాన్ మసాలాను విక్రయించే ప్యాకెట్ల తయారీలో ప్లాస్టిక్‌తో పాటు ఎలాంటి సింథటిక్ మెటీరియళ్లను ఉపయోగించకూడదని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆహార ఉత్పత్తుల ప్యాకింగ్‌కు సంబంధించి ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్, మెటలైజ్డ్ లేయర్లను అనుమతించే జాబితా నుంచి పూర్తిగా తొలగించింది. కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో సోమవారం ప్రచురించిన ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్యాకేజింగ్) అమెండ్‌మెంట్ రెగ్యులేషన్స్, 2026’ ద్వారా ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వచ్చాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ, 2018 నాటి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్యాకేజింగ్) నియమాల్లో మార్పులు చేసింది. ఇందులో భాగమైన షెడ్యూల్-4 కింద పాన్ మసాలా ప్యాకింగ్‌ను కొత్త ఎంట్రీగా చేర్చారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం పాన్ మసాలాను కేవలం పేపర్, పేపర్‌బోర్డ్, సెల్యులోజ్ లేదా ఇతర సహజసిద్ధమైన ప్లాస్టిక్ రహిత మెటీరియల్స్‌లో మాత్రమే ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్యాకింగ్ మెటీరియల్‌లో పాలిథిలిన్, పాలిప్రొఫైలిన్, పాలిస్టర్, పీవీసీ (పాలీవినైల్ క్లోరైడ్) వంటి ఏ విధమైన సింథటిక్ పాలిమర్లు, కోపాలిమర్లు లేదా లామినేట్లు ఉండకూడదని నోటిఫికేషన్‌లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నొక్కి చెప్పింది. బయటకు కాగితంలా కనిపించి, లోపల ప్లాస్టిక్ లేదా మెటలైజ్డ్ కోటింగ్ ఉండే ప్యాకెట్లను కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. అయితే, తయారీదారులు విక్రయాల కోసం టిన్ లేదా గాజు (గ్లాస్) కంటైనర్లను ప్రత్యామ్నాయంగా వాడుకోవడానికి సమ్మతి తెలిపారు. ఈ నిబంధనల అమలు ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలు-2016 కూడా పాన్ మసాలా పరిశ్రమకు వర్తిస్తాయి.
పాన్ మసాలా ప్యాకేజింగ్‌లో సింథటిక్ మెటీరియళ్లను ఉపయోగించకూడదు : భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ
الأربعاء، 12 أغسطس 2026
Central Government Gazette on Monday FSSAI national new regulations came into effect immediately Synthetic materials must not be used in pan masala packaging
ليست هناك تعليقات:
إرسال تعليق