తిరుపతి విమానాశ్రయంలో అందుబాటులోకి రానున్న ఈ-వీసా సేవలు

الأربعاء، 12 أغسطس 2026

Andhra Prades Central Government is set to introduce a key facility devotees traveling from abroad to Tirumala E-Visa Services to be Introduced at Tirupati Airport

t f B! P L

విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. తిరుపతి విమానాశ్రయంలోనే ఈ-వీసా సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో విదేశీ ప్రయాణికులకు తిరుపతి ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇప్పటి వరకు విదేశీ భక్తులు తిరుపతికి రావాలంటే ముందుగా చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్ విమానాశ్రయాలకు చేరుకోవాల్సి వచ్చేది. అక్కడ ఈ-వీసా ప్రక్రియను పూర్తి చేసుకున్న అనంతరం రోడ్డు లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా తిరుపతికి చేరుకునేవారు. తాజా నిర్ణయంతో ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని ఈ-వీసా ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం లభించనుంది. దీంతో శ్రీవారి దర్శనం కోసం విదేశాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణ సమయం, అదనపు ప్రయాస తగ్గే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం పది రోజుల ముందుగానే ఆన్‌లైన్‌లో ఈ-వీసా పొందాల్సి ఉంటుంది. తిరుపతి విమానాశ్రయంలో ఈ-వీసా సంబంధిత సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణికులకు అవసరమైన ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నారు. ప్రస్తుతం తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులో లేవు. అయినప్పటికీ కేంద్ర పౌర విమానయాన శాఖ ముందుగానే ఈ-వీసా కౌంటర్‌కు అనుమతి మంజూరు చేసింది. త్వరలో తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందనే సంకేతాలు ఈ నిర్ణయంతో కనిపిస్తున్నాయి. తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించే ప్రక్రియ చాలాకాలం క్రితమే ప్రారంభమైంది. 2007లోనే తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అనంతరం 2017లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో తిరుపతి విమానాశ్రయంలో ఈ-వీసా సేవలను అందుబాటులోకి తీసుకురావడం, భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభానికి మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ