జాతీయ పరీక్షల ఏజెన్సీలో భారీ ప్రక్షాళన !

Tuesday, August 18, 2026

agency is removing over 50 existing staff members Major Overhaul at the National Testing Agency national preparing to bring in top-tier experts to fill their roles

t f B! P L

ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న అవకతవకలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో జాతీయ పరీక్షల ఏజెన్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షా వ్యవస్థలో పూర్తిస్థాయి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు విధులు నిర్వహించిన 50 మందికి పైగా సిబ్బందిని తొలగించి, వారి స్థానాల్లో అత్యున్నత నిపుణులను భాగస్వామ్యం చేసేందుకు సమాయత్తమవుతోంది. సంస్థ పనితీరును మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు జాతీయ పరీక్షల ఏజెన్సీ పది కొత్త కీలక పదవులను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్  వంటి అత్యున్నత స్థాయి పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ నూతన నియామకాల ద్వారా సాంకేతిక, ఫైనాన్స్ సంబందిత నిర్వహణను మరింత బలోపేతం చేయాలని ఏజెన్సీ భావిస్తోంది. సైబర్ భద్రతను పటిష్టం చేయడంతో పాటు పరీక్షల నిర్వహణలో సైకోమెట్రిక్స్ వంటి అధునాతన విధానాలను అమలు చేసేందుకు ప్రైవేట్ రంగం నుంచి అనుభవజ్ఞులైన నిపుణులను తీసుకోనున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి జాతీయ పరీక్షల ఏజెన్సీ అధికారులతో సమీక్ష నిర్వహించి, పరీక్షా విధానంలో పారదర్శకతను పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ