ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగ దేశాలలో ఒకటైన చైనా, పేపర్ గోల్డ్ వ్యాపారంపై ఊహించని విధంగా కఠిన ఆంక్షలు విధించింది. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాతో పాటు ఆ దేశంలోని దాదాపు 90 శాతం బ్యాంకులు షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్‌తో ముడిపడి ఉన్న పలు ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ట్రేడింగ్‌ను తక్షణమే నిలిపివేశాయి. ముఖ్యంగా లీవరేజ్ ఆధారిత స్పాట్ కాంట్రాక్టులు.. డిఫర్డ్ కాంట్రాక్టుల సేవల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా, తమ ఖాతాదారులను వెంటనే పొజిషన్లను క్లోజ్ చేయాలని లేదా భౌతిక బంగారాన్ని డెలివరీ తీసుకోవాలని స్పష్టం చేశాయి. చైనా తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం వెనుక బలమైన ఆర్థిక వ్యూహాలు, రిస్క్ మేనేజ్‌మెంట్ దాగి ఉన్నాయి. సాధారణంగా పేపర్ గోల్డ్ వ్యాపారంలో ‘లీవరేజ్’ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. అంటే ఇన్వెస్టర్లు స్వల్ప మొత్తంలో మార్జిన్ మనీని చెల్లించి.. మార్కెట్లో చాలా పెద్ద పరిమాణంలో గోల్డ్ పొజిషన్లను కొనుగోలు చేస్తుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో బంగారం ధరలు హఠాత్తుగా పడిపోతే.. ఈ లీవరేజ్ ట్రేడింగ్ వల్ల ఇన్వెస్టర్లతో పాటు బ్యాంకులు కూడా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ రకమైన ఊహాజనిత ట్రేడింగ్‌ను అరికట్టడం ద్వారా తన ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచడమే చైనా ప్రాథమిక లక్ష్యం. దీనితో పాటు మార్కెట్‌లో కేవలం కాగితాలపై జరిగే వ్యాపారాన్ని పక్కన పెట్టి.. వాస్తవమైన భౌతిక బంగారానికి ప్రాధాన్యత ఇవ్వాలని చైనా భావిస్తోంది.
ホーム
/
international
/
పేపర్ గోల్డ్ పై కఠిన ఆంక్షలు విధించిన చైనా
Monday, August 3, 2026
business China aims to shift focus away from paper-based trading and prioritize actual physical gold China Imposes Strict Restrictions on Paper Gold international
No comments:
Post a Comment