సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో బంగారు గని కూలిపోవడంతో 100 మందికి పైగా మరణించారు. పదులకొద్దీ శిథిలాల కింద చిక్కుకుపోయారు. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ పశ్చిమ ప్రాంతంలోని ఒక బంగారు గని అకస్మాత్తుగా కూలిపోయింది. స్థానిక అధికారులు సహాయక చర్యలలో నిమగ్నమైయ్యారు. రెడ్ క్రాస్ ప్రకారం అబ్బా ప్రాంతంలోని ఒక చిన్న బంగారు గనిలో ఈ ప్రమాదం జరిగింది. మొదట 30 మంది మరణించినట్లు నివేదించగా, ఆ తర్వాత ఆ సంఖ్య 100కి పైగా పెరిగింది. మృతదేహాలను వెలికితీయడానికి సహాయక సిబ్బంది గంటల తరబడి చేతులతో బురద, శిథిలాలను తొలగించారు. గని లోపల ఇంకా చాలా మంది చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికులు, సహాయక సిబ్బంది కలిసి శిథిలాలను తొలగించడానికి కృషి చేస్తున్నారు. గనిలోకి ప్రవేశించడం అత్యంత కష్టంగా ఉండటంతో చిక్కుకున్న వారిని త్వరగా రక్షించడం సహాయక బృందాలకు ఒక పెద్ద సవాలుగా మారింది. సమయం గడిచేకొద్దీ వారిని సజీవంగా కనుగొనే అవకాశాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. గని కూలిపోయిన తర్వాత సహాయక చర్యలకు అవసరమైన యంత్రపరికరాలు అందుబాటులో లేవు. సహాయక సిబ్బంది, స్థానిక నివాసితులు చేతులతోనే బురదను, శిథిలాలను తొలగించారు. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో కూలిన బంగారు గని : వంద మంది దుర్మరణం
الخميس، 20 أغسطس 2026
Dozens remain trapped beneath the debris Gold Mine Collapse in Central African Republic international Over 100 Dead Videos Go Viral on Social Media
ليست هناك تعليقات:
إرسال تعليق