శాసనసభ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేల జీతభత్యాల్లో కోత విధించాలి !

الأربعاء، 12 أغسطس 2026

Andhra Pradesh proposal to the Central Government Salaries and allowances of MLAs absent from Assembly sessions should be cut Speaker Chintakayala Ayyanna Patrudu

t f B! P L

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు హాజరుకాని ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శాసనసభకు రాకుండా, ప్రజ సమస్యలపై చర్చల్లో పాల్గొనని ఎమ్మెల్యేల జీతభత్యాల్లో కోత విధించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు నియమ నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. ప్రజల పన్నుల డబ్బుతో ప్రజాప్రతినిధులకు జీతాలు, అలవెన్సులు చెల్లిస్తున్నాం. కానీ సభకు రాకుండా బాధ్యతలను విస్మరిస్తే వారికి జీతం పొందే హక్కు లేదు అని స్పీకర్ స్పష్టం చేశారు. గత ఎన్నికల అనంతరం వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా లభించకపోవడం, కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. సభలో తమకు మాట్లాడేందుకు తగిన సమయం ఇచ్చే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన ప్రతిపాదనలు నేరుగా వైఎస్ జగన్ మరియు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించినవేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ నియమావళిలో మార్పుల కోసం ఏపీ స్పీకర్ పంపిన ఈ లేఖపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ప్రజాప్రతినిధుల హాజరుపై కొత్త నిబంధనలు తెస్తే.. దేశవ్యాప్తంగా చట్టసభలకు రాకుండా నిరసనలు తెలిపే ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇది చెక్ పెట్టినట్లవుతుంది. సభకు రాకపోతే రూల్స్ ప్రకారం జీతాల్లో కోత పడటంతో పాటు పదవులకు కూడా గండం పొంచి ఉండే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ