జాతీయ పింఛను విధానం పరిధిలోకి గిగ్ కార్మికులు

الخميس، 13 أغسطس 2026

and quick commerce food delivery Gig Workers Brought Under the National Pension System national PFRDA is promoting the 'e-Shramik' model ride-sharing

t f B! P L

ఫుడ్ డెలివరీ, రైడ్ షేరింగ్, క్విక్ కామర్స్ వంటి డిజిటల్ వేదికల్లో పనిచేస్తున్న గిగ్ కార్మికుల భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించే దిశగా పీఎఫ్‌ఆర్‌డీఏ కీలక నిర్ణయం తీసుకుంది.సాంప్రదాయ ఉద్యోగాల వలె పదవీ విరమణ ప్రయోజనాలు లేని ఈ అసంఘటిత రంగాన్ని జాతీయ పింఛను విధానం పరిధిలోకి తీసుకురావడానికి 'ఈ-శ్రామిక్'  నమూనాను పీఎఫ్‌ఆర్‌డీఏ ప్రచారం చేస్తోంది. గిగ్ కార్మికుల నెలవారీ ఆదాయంలో ఉండే హెచ్చుతగ్గులను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్‌ను సులభతరంగా తీర్చిదిద్దారు. కార్మికులు కేవలం రూ.99 వంటి నామమాత్రపు చందాతో పొదుపును ప్రారంభించవచ్చు. అయితే, విరాళాలపై నిర్బంధ కనీస పరిమితి ఏదీ విధించలేదు. ఈ విధానంలో పొదుపు మొత్తాన్ని కార్మికుడు ఒక్కడే చెల్లించవచ్చు లేదా అగ్రిగేటర్ సంస్థ పూర్తిగా భరించవచ్చు లేదా ఇద్దరూ కలిసి సంయుక్తంగా జమ చేసే వెసులుబాటును కల్పించారు. అగ్రిగేటర్లతో అనుబంధం ఉన్న 'పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్'(పీఓపీ)ల ద్వారా నమోదు ప్రక్రియ జరుగుతుంది. ఆధార్ ఆధారిత కేవైసీ, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పిస్తే చాలు కార్మికుడికి శాశ్వత రిటైర్మెంట్ ఖాతా సంఖ్య (ప్రాన్‌) కేటాయిస్తారు. ఈ వ్యవస్థలో ఉన్న ప్రధాన ప్రయోజనం.. పోర్టబిలిటీ. కార్మికుడు ఒక సర్వీస్ ప్లాట్‌ఫామ్ నుంచి మరొక దానికి మారినప్పటికీ అతడి పెన్షన్ ఖాతా యథాతథంగా కొనసాగుతుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ