ఆగస్టు 26న రియల్ మీ పి4s స్మార్ట్ ఫోన్ విడుదల

الخميس، 20 أغسطس 2026

business company has been teasing the device via Amazon India design similar to the recently released P4 Power model Realme P4s Smartphone Launching on August 26 technology

t f B! P L

దేశీయ మార్కెట్లో ఆగస్టు 26న రియల్ మీ పి4s స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నది. రియల్ మీ అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ కూడా ఇటీవల విడుదల చేసిన P4 పవర్ స్మార్ట్ ఫోన్ మాదిరి డిజైన్ తో ఉంటుంది. ఇందులో 1.5K రిజల్యూషన్ కలిగిన M14 బిగ్ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ HDR 10+ మరియు నెట్ ఫ్లిక్స్ HDR సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను డ్యూయల్ చిప్ పవర్ తో అందిస్తుంది. ఇందులో మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ జతగా హైపర్ విజన్ ప్లస్ AI డెడికేటెడ్ గేమింగ్ చిప్ కూడా ఉంటుంది. ఈ సెటప్ తో ఈ ఫోన్ 144 FPS వద్ద ఏకంగా 9 గంటల BGMI గేమ్ ప్లే అందిస్తుందని రియల్ మీ తెలిపింది. ఇది మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది మరియు సెగ్మెంట్ పెర్ఫార్మన్స్ కిల్లర్ ఫోన్ గా ఉంటుంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా జతగా 8MP AI కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ గొప్ప కెమెరా సెటప్ మాత్రమే కాదు గొప్ప బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 8000 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అలాగే, ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ ను వేగంగా కూల్ చేసే పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 అండ్ IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో కూడా ఉంటుంది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ