ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్-కౌశంబి సరిహద్దులో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి ఎనిమిది మంది మరణించారు. ఈ పేలుడు ధాటికి కేంద్రం నేలమట్టం కావడంతో శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో 15 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు ధాటికి ఆ తయారీ కేంద్రం పూర్తిగా నేలమట్టమవడమే కాకుండా, సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయి. భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించడంతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాద సమయంలో కేంద్రంలో పలువురు కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. బుల్డోజర్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ホーム
/
Uttar Pradesh
/
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు : ఎనిమిది మంది దుర్మరణం, 15 మందికి గాయాలు
الاثنين، 31 أغسطس 2026
15 injured Damaged nearby buildings Eight Dead Massive Explosion at Firecracker Unit Prayagraj-Kaushambi border Uttar Pradesh
ليست هناك تعليقات:
إرسال تعليق