చనిపోయిందని నిర్ధారించిన వైద్యులు : అంబులెన్స్ కుదుపుతో తిరిగొచ్చిన ప్రాణం !

الجمعة، 31 يوليو 2026

Andhra Pradesh Doctors Declared Her Dead Eluru district former Sarpanch of Bhujabalapatnam Gurajala Ramatulasi Kaikaluru Mandal Life Returns After Ambulance Jolt

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నం మాజీ సర్పంచ్, పార్టీ నాయకురాలు గురజాల రామతులసి కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఏలూరులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం ఇక ఆశలు వదులుకోవాలని, ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని వైద్యులు తేల్చిచెప్పారు. గురువారం తెల్లవారుజామున వెంటిలేటర్‌పై ఉంచి సీపీఆర్‌తో పాటు అన్ని వైద్య సేవలు అందించినప్పటికీ, నాడి పూర్తిగా పడిపోవడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆమె మరణ వార్త తెలుసుకుని సోషల్ మీడియాలోనూ నివాళుల పోస్టులు వెల్లువెత్తాయి. అనంతరం కుటుంబ సభ్యులు ఆమె పార్థివదేహాన్ని ప్రైవేటు అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మండవల్లి మండలం పులపర్రు వద్దకు వచ్చేసరికి అంబులెన్స్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయింది. ఈ ప్రయత్నంలో అంబులెన్స్ రోడ్డుపై ఉన్న పెద్ద గుంతలో ఒక్కసారిగా పడింది. ఆ కుదుపు ధాటికి చనిపోయారనుకున్న రామతులసి శరీరంలో ఒక్కసారిగా చలనం వచ్చింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యచక్రితులై వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమెలో ఇంకా కొన ఊపిరి ఉందని, బతకడం కష్టమని తెలిపారు. దీంతో వెంటనే ఆమెను ఏలూరు సర్వజన ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ వైద్యుల బృందం అందించిన అత్యవసర చికిత్సతో సాయంత్రానికి ఆమె ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ