తుఫానును తలపించేలా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం : వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరిక

الخميس، 30 يوليو 2026

​​Meteorological Department issues urgent warning national Risk of heavy to extremely heavy rainfall resembling a cyclone

t f B! P L

భారతదేశం పైభాగంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇప్పుడు పశ్చిమ దిశగా వేగంగా కదులుతోంది. దీనికి తోడు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల నుంచి పెద్దెత్తున తేమ గాలులు వచ్చి చేరుతుండటంతో వర్షాలు ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో పలు రాష్ట్రాల్లో ముసురు పట్టడంతో పాటు తుఫానును తలపించేలా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని  భారత వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం ఈ డీప్ డిప్రెషన్ ప్రభావం ప్రధానంగా పశ్చిమ, మధ్య భారత భూభాగాలపై గట్టిగా ఉండబోతోంది. గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, మరాఠ్వాడాలోని కొన్ని  ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు హఠాత్ పూరిత వరదలు  వచ్చే ప్రమాదం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. సాధారణ అల్పపీడనం కంటే తీవ్రమైనది, తుఫాను కంటే కొద్దిగా తక్కువ స్థాయి కలిగిన వాతావరణ పరిణామాన్ని 'డీప్ డిప్రెషన్'గా వ్యవహరిస్తారు. ఇది సముద్రం లేదా భూభాగంపై వేగంగా వర్ష మేఘాలను కూడగడుతుంది. వేడి, తేమతో కూడిన గాలులు పైకి లేచి చల్లబడటం ద్వారా ఆకాశం నిండా భారీ వర్ష మేఘాలు దట్టంగా అలుముకుంటాయి. దీని కారణంగా ఒక్కసారిగా ఒకే ప్రాంతంలో గంటల తరబడి ఆగకుండా వర్షం కురుస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ