కరూర్ తొక్కిసలాట కేసు : సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు

الاثنين، 6 يوليو 2026

currently serving as ministers in Vijay's cabinet. Allegations have surfaced that they are influencing the ongoing CBI investigation Karur stampede case PIL Filed Seeking Supreme Court Intervention

t f B! P L

మిళనాడులో గతేడాది చోటు చేసుకున్న కరూర్ తొక్కిసలాట  కేసులో అప్పట్లో నిందితులుగా ఉన్న వారు ప్రస్తుతం విజయ్ కేబినెట్ లో  మంత్రులుగా ఉన్నారు. వీరు ప్రస్తుతం జరుగుతున్న సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై గతంలో కోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. విచారణలో భాగంగా రెండుసార్లు ఢిల్లీకి విజయ్ ను రప్పించి వివరాలు తీసుకుంది. అయితే తాజాగా విజయ్ కేబినెట్లోని మంత్రులు ఈ కేసులో సాక్ష్యుల్ని ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే కారణంతో తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. దీంతో కరూర్ తొక్కిసలాట కేసులో నిందితులుగా ఉండి, ప్రస్తుతం తమిళనాడు కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కొందరు వ్యక్తులు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టులో  జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని రేపు విచారించనుంది. ఇందులో ప్రస్తుతం జరుగుతున్న కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తును విజయ్ మంత్రులు ప్రభావితం చేస్తున్నారని తేలితే సుప్రీంకోర్టు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరూర్ తొక్కిసలాట కేసు విషయంలో విజయ్ ఎలా ముందుకు వెళ్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ