నడిరోడ్డుపై వివస్త్రను చేసి కాళ్లతో తంతూ చావబాదిన తెలుగుదేశం నాయకుడు : దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

السبت، 18 يوليو 2026

Andhra Pradesh guntur kicks and beats her severely police take the accused into custody Telugu Desam leader strips woman in the middle of the road

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో నీటి మోటార్ వేసే విషయంలో 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులకు, స్థానిక మహిళకు మధ్య చిన్నపాటి వివాదం మొదలైంది. ఈ గొడవ కాస్తా ముదరడంతో, మల్లెల మూర్తి కుటుంబం అమానవీయంగా ప్రవర్తించింది. కొందరు హిజ్రాలతో కలిసి మహిళపై దాడికి దిగారు. అంతటితో ఆగక నడిరోడ్డుపైనే ఆమెను వివస్త్రను చేసి కాళ్లతో తంతూ చావబాదారు. ఈ దాడికి సంబంధించిన భయానక సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దారుణ ఘటనపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి తీవ్రంగా స్పందించారు. బాధిత మహిళ తనను కలిసి ఆవేదన వ్యక్తం చేసిన వెంటనే ఎమ్మెల్యే పోలీసులతో మాట్లాడి కఠిన చర్యలకు ఆదేశించారు. "మహిళల గౌరవం, భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు" అని స్పష్టం చేసిన ఎమ్మెల్యే మాధవి.. నిందితుడు మల్లెల మూర్తిని తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని, బాధిత కుటుంబానికి తాము పూర్తి అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. వైరల్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నగరంపాలెం పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఘటనపై పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మహిళలపై ఇలాంటి అనాగరిక దాడులకు పాల్పడే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం గట్టి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఎంతైనా ఉంది. గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, మన సమాజంలో ఇలాంటి అనాగరిక చర్యలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ