పవన్ కళ్యాణ్‌కు కుడి భుజానికి శస్త్రచికిత్స

السبت، 11 يوليو 2026

Andhra Pradesh Mumbai's Kokilaben Dhirubhai Ambani Hospital Prime Minister Narendra Modi called Surgery Performed on Pawan Kalyan's Right Shoulder

t f B! P L

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ వైద్య నిపుణుల బృందం కుడి భుజానికి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీపై మూడున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది. రెండు భుజాల్లోనూ తీవ్ర గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించగా మరో భుజానికి రెండు నెలల తర్వాత శస్త్రచికిత్స చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్‌కు 2016లో భుజానికి గాయం అయినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పోరాట యాత్ర, రైతు పర్యటనలు, వారాహి యాత్ర, ఎన్నికల ప్రచారాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు కరచాలనం చేయడం, చేతులు పట్టి లాగడం వంటి సందర్భాల్లో గాయాలు మరింత తీవ్రతరమైనట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో రెండు భుజాల్లోనూ రొటేటర్ కఫ్ దెబ్బతినడంతో పాటు కండరాలు కూడా చిట్లినట్లు వైద్యులు గుర్తించారు. ఇంత తీవ్రమైన గాయాలతోనూ ప్రజా కార్యక్రమాలు నిర్వహించడం ఆశ్చర్యకరమని వైద్యులు వ్యాఖ్యానించినట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. కొద్ది రోజుల క్రితం ముంబైలో సమగ్ర పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్సకు నిర్ణయించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ