అమెరికాలో విజయవాడకు చెందిన సబ్బినేని రజిత గతేడాది అక్టోబర్ 27న అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. వాషింగ్టన్ స్టేట్ బెల్‌వ్యూ పోలీసులు జరిపిన విచారణలో..రజితను అమె భర్త నార్నే అవినాష్ చంపాడని వెల్లడవడంతో కేసును హత్య కేసుగా మార్చారు. గాయత్రీనగర్‌కు చెందిన సబ్బినేని కృష్ణారావుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రజితను గతేడాది తెలంగాణకు చెందిన నార్నే అవినాష్ కు ఇచ్చి హైదరాబాద్‌లో పెళ్లి చేశారు. జులైలో ఈ జంట అమెరికాలోని వాషింగ్టన్‌కు వెళ్లిపోయారు. పెళ్ళికి ముందుగానే అవినాష్‌కు భారత్‌కు చెందిన మరో మహిళతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ కారణంగా రజితను చంపాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. భార్యను ఎలా చంపితే పోలీసులకు దొరక్కుండా ఉంటారనే విషయంపై ఇంటర్నెట్‌లో వెతికాడు. గాలి ఆడకుండా చేస్తే ఎంత సమయానికి మనిషి ప్రాణాలు పోతాయనే విషయాలను వెతికి, గతేడాది అక్టోబర్ 27న రజితను గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. వెంటనే మృతదేహాన్ని ఫొటో తీసి తన ప్రియురాలికి వాట్సాప్‌లో పంపాడు. రజిత బాత్‌రూమ్‌లోకి వెళ్ళి లాక్ చేసుకుందని, ఎంత పిలిచినా రావడం లేదని పోలీసులకు ఫోన్ చేసి అవినాష్ చెప్పాడు. పోలీసులు వచ్చేలోపే రజిత అపస్మారకస్థితిలో పడిఉంది. వైద్యులు పరిశీలించి ఆమె మరణించిందని తెలిపారు. ఆ సమయంలోనే రజిత మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డిజిటల్ ఫోరెన్సిక్స్ ద్వారా రజితను చంపాడని గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రజిత తల్లిదండ్రులు అమెరికాకు బయలుదేరారు. అమెరికా పోలీసులు అవినాష్ ను అరెస్ట్ చేశారు.
ホーム
/
VIJAYAWADA
/
అమెరికాలో విజయవాడకు చెందిన సబ్బినేని రజితను హత్య చేసిన భర్త అవినాష్
السبت، 11 يوليو 2026
Andhra Pradesh Husband Avinash Murders Rajitha Sabbineni in the US telangana US police arrested Avinash VIJAYAWADA
ليست هناك تعليقات:
إرسال تعليق