బహమాస్ లో కుప్పకూలిన విమానం : 10 మంది దుర్మరణం!

السبت، 11 يوليو 2026

international Plane Crashes in Bahamas: 10 Killed Shortly after takeoff technical malfunction the plane lost control and crashed suddenly near Andros

t f B! P L

హమాస్ లో ప్రయాణికులతో వెళ్తున్న ఒక చిన్న విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అధికారుల సమాచారం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో బహమాస్ రాజధాని నస్సౌలోని ‘లిండెన్ పిండ్లింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్’ నుంచి ఈ విమానం టేకాఫ్ అయింది. విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే నియంత్రణ కోల్పోయి, బహమాస్‌లోనే అత్యంత పెద్ద ద్వీపమైన ఆండ్రోస్ సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానం భూమిని ఢీకొట్టిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే బహమాస్ రెస్క్యూ టీమ్స్, రక్షణ సిబ్బంది ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే విమానం పూర్తిగా కాలి బూడిదవ్వడంతో లోపల ఉన్న వారెవరూ ప్రాణాలతో బయటపడలేకపోయారని అధికారులు ధృవీకరించారు. మృతుల్లో విమాన పైలట్‌తో పాటు ప్రయాణికులు ఉన్నారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం నస్సౌలోని ఆసుపత్రికి తరలించారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని, ఇంజిన్ వైఫల్యం లేదా వాతావరణంలో వచ్చిన అకస్మాత్తు మార్పులే ఈ ప్రమాదానికి కారణం కావచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నారు. బహమాస్ సివిల్ ఏవియేషన్ అథారిటీ  మరియు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ అధికారులు ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకుని, ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనపై బహమాస్ ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సానుభూతి ప్రకటించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వీలైనంత త్వరగా వెల్లడిస్తామని భద్రతా అధికారులు పేర్కొన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ