తెలంగాణ హైకోర్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేసింది. తన 20 గుంటల భూమిని ఆర్డీవో, తహసీల్దార్ మ్యుటేషన్ చేయడంలేదని హైకోర్టులో నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఎరాజ్ పల్లె గ్రామానికి చెందిన లోకనడిపి హనుమాండ్లు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారిస్తూ ప్రజలు అప్లికేషన్లు పెట్టుకుని నెలలు గడుస్తున్నా భూ సర్వేలు చేయకపోవడం, మ్యుటేషన్లు చేయకపోవడం, పాస్ పుస్తకాలు జారీ చేయకపోవడం లాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని హైకోర్టు తెలిపింది. పాస్ పుస్తకాల కోసం 3 నెలలు, భూ సర్వే కోసం 6 నెలల సమయం పడుతుందా?…అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెంది ప్రజలు హైకోర్టుకు వస్తున్నారు. హైకోర్టు చెప్పకపోతే మీ పని మీరు చేయలేరా? … ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ, కేసును నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
రెవెన్యూ శాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు
الأربعاء، 8 يوليو 2026
Expresses Dissatisfaction with Revenue Department Officials failing to process the mutation of his 20-gunta land parcel Telangana High Court
ليست هناك تعليقات:
إرسال تعليق