ప్రాణం తీసిన కొబ్బరి బొండం : రోడ్డు ప్రమాదం ఇద్దరు దుర్మరణం

السبت، 4 يوليو 2026

Andhra Pradesh crime Fatal Coconut-Laden Vehicle Road Accident Claims Two Lives West Bypass in Krishna District

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా వెస్ట్‌ బైపాస్‌పై జక్కంపూడి - షాబాద్‌ల మధ్య శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు దుర్మరణం చెందారు. వివరాలలోకి వెళ్తే రాజమండ్రి సీతంపేటకు చెందిన దువ్వూరి హరిప్రసాద్‌ (52) పురోహితుడు. హరిప్రసాద్‌ చిన్న కుమారుడి వివాహం ఉండటంతో కుటుంబం హైదరాబాద్‌ వెళ్లి, పెళ్లి ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి పెళ్లి కొడుకు, పెళ్లికూతురుతో పాటు మిగిలిన వారందరూ ఒక కారులో, హరిప్రసాద్‌ తన బంధువుతో పాటు పెళ్లి సామగ్రి తీసుకుని మరో కారులో బయలుదేరారు. తన బంధువును గొల్లపూడి వద్ద దింపిన హరిప్రసాద్‌ కారును వెస్ట్‌ బైపాస్‌ వైపు మళ్లించాడు. జక్కంపూడి - షాబాద్‌ల మధ్య అండర్‌ పాస్‌ వద్దకు వచ్చే సరికి ఎదురు వెళ్తున్న బైక్‌ను హరిప్రసార్‌ కారు ఢీ కొట్టింది. ఆపై రోడ్డుకు పక్కనే నిలిపి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ కారు నడుపుతున్న హరిప్రసాద్‌ అక్కడి కక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న పాయకాపురానికి చెందిన సూరిబోయిన హరికృష్ణ స్వల్పంగా, అతని తండ్రి గురవయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న కొద్దిసేపటికే గురవయ్య మృతి చెందాడు. గురవయ్య బోయమడుగులకు వీఆర్‌ఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురవయ్య కొంత కాలం కిందట గుండె ఆపరేషన్‌ చేయించుకోగా, మందుల కోసం గుంటూరు వెళ్లి తిరిగి పాయకాపురానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ