ఉసిరిలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల గోడలు డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. అలాగే పసుపులో ఉండే 'కర్కుమిన్' అనే శక్తివంతమైన సమ్మేళనం శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (మంట, నొప్పులు) తగ్గించి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల గుండెకు రెట్టింపు రక్షణ లభిస్తుంది. ఉసిరి, పసుపు కలిపిన మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. రక్తనాళాలు సాఫీగా వ్యాకోచించడానికి 'నైట్రిక్ ఆక్సైడ్' ఎంతో అవసరం. ఉసిరి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచడానికి దోహదపడగా.. పసుపు అది విడిపోకుండా కాపాడుతుంది. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగై, బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదం తప్పుతుంది. తీవ్రమైన స్ట్రెస్, కాలుష్యం, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ తినడం వల్ల రక్తనాళాలు నీరసించిపోతాయి (ఎండోథీలియల్ డిస్ఫంక్షన్). ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు, పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిసి ఈ ఎండోథీలియల్ పనితీరును మెరుగుపరుస్తాయి. వాతావరణ కాలుష్యం, ఫాస్ట్ ఫుడ్స్ వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరిగిపోయి గుండె వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ ఉసిరి-పసుపు షాట్ శరీరానికి ఒక రక్షణ షీల్డ్‌లా పనిచేస్తూ ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా గుండెను గురకపెట్టకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, హార్ట్ ఎటాక్ ముప్పు దరిచేరకూడదన్నా వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు ఉసిరి రసం, పసుపు కలిపి తీసుకోవడం మంచిది.
ఉసిరి, పసుపు కలిపి తీసుకుంటే కొలెస్ట్రాల్ మాయం
الثلاثاء، 16 يونيو 2026
arogyam Combining Amla and Turmeric Eliminates Cholesterol Health Tips Nitric oxide is essential for the smooth dilation of blood vessels; Vitamin C and antioxidants
ليست هناك تعليقات:
إرسال تعليق