జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరిన వేళ అక్కడ రాజకీయ సమీకరణాలు ఊహించని మలుపులు తిరిగాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించి, ఈసారి రేసులో లేరనుకున్న రిలయన్స్ గ్రూప్ ప్రెసిడెంట్ పరిమళ్ నత్వానీ చివరి నిమిషంలో మళ్లీ జార్ఖండ్ నుంచే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీస్ లాబీయింగ్, ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో అపారమైన పట్టున్న నత్వానీ. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో భేటీ అయిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పరిమళ్ నత్వానీకి ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్‌జేపీ, ఏజేఎస్‌యూ పార్టీలకు చెందిన ఎన్డీయే ఎమ్మెల్యేలు ప్రతిపాదకులుగా సంతకాలు చేసి మద్దతు పలికినట్లు తెలుస్తోంది. గతంలో 2008, 2014 లలో ఇదే జార్ఖండ్ గడ్డపై స్వతంత్రుడిగా గెలిచిన పాత రికార్డును తిరగరాయడానికి నత్వానీ తన కార్పొరేట్ అఫైర్స్ బలాన్ని రంగంలోకి దించారు. దీంతో అధికార ఇండియా కూటమిలో జేఎమ్‌ఎమ్ అభ్యర్థి బైజ్‌నాథ్ రామ్ విజయం దాదాపు ఖాయమైనప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా గెలుపు మాత్రం ఇప్పుడు తీవ్రంగా ప్రమాదంలో పడింది.
జార్ఖండ్ రాజ్యసభ బరిలో నత్వానీ !
الاثنين، 8 يونيو 2026
business independent candidate from Jharkhand at the last minute national Parimal Nathwani Enters the Fray for Jharkhand Rajya Sabha Seat Reliance Group President
ليست هناك تعليقات:
إرسال تعليق