కర్ణాటకలోని కలబుర్గి, స్టేషన్ బజార్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసులో పోలీస్‌స్టేషన్‌లో లంచం తీసుకుంటూ మహిళా కానిస్టేబుల్ జ్యోతి లోకాయుక్తకు చిక్కగా, ఏఎస్సై శివశరణప్ప పరారయ్యారు. చెత్త ఏరుకునే మహిళ కుమార్తె (మైనర్) పై అత్యాచారం జరిగింది. ఈ కేసులో చార్జ్‌షీట్ వేయాలని, మీకు అనుకూలంగా రాయాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని జ్యోతి, ఏఎస్సై శివశరణప్ప బాలిక తల్లిని డిమాండు చేశారు. కూతురిపై అఘాయిత్యం జరిగి బాధపడుతుంటే, పోలీసులు డబ్బుల కోసం పీడించడంతో ఆమె వేదనకు గురైంది. దీంతో కొందరు సామాజిక కార్యకర్తల సాయంతో లోకాయుక్తను ఆశ్రయించింది. ఆమె నుంచి జ్యోతి లంచం తీసుకుటుండగా లోకాయుక్త పోలీసులు దాడి చేశారు. అక్కడే ఉన్న ఏఎస్సై పలాయన మంత్రం పఠించాడు. అతని కోసం గాలిస్తున్నారు.
డబ్బులు ఇస్తేనే పోక్సో కేసు అనుకూలంగా రాస్తా : లంచం తీసుకుంటూ చిక్కిన మహిళా కానిస్టేబుల్, ఏఎస్సై శివశరణప్ప పరార్
الاثنين، 8 يونيو 2026
"I'll write the POCSO case report in your favor only if you pay" ASI Shivasharanappa absconds Female constable caught taking bribe karnataka Station Bazar Police Station in Kalaburagi
ليست هناك تعليقات:
إرسال تعليق