విద్యాశాఖపై పూర్తిగా పట్టు కోల్పోయిన ముఖ్యమంత్రి : సీఎం వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కల్వకుంట్ల కవిత

الاثنين، 8 يونيو 2026

Chief Minister Has Completely Lost Grip on the Education Department CM of acting "worse than Hitler" Kalvakuntla Kavitha Lashes Out at CM's Remarks telangana

t f B! P L

తెలంగాణ రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేస్తామన్న సీఎం వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 27 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి కేవలం 4 వేల పాఠశాలలను మాత్రమే కొనసాగిస్తామనడం విద్యా వ్యవస్థపై ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందన్నారు. సీఎం “హిట్లర్ కంటే ఎక్కువగా వ్యవహరిస్తున్నారని, పేదలు, ఆడపిల్లలకు విద్యను దూరం చేసే విధానాలను అవలంబిస్తున్నారని ఆమె ఆరోపించారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి పూర్తిగా పట్టు కోల్పోయారని కవిత విమర్శించారు. విద్యాశాఖను ఒక సర్కస్‌లా మార్చేశారని వ్యాఖ్యానించారు. ఇంటర్మీడియట్ విద్యా విధానంపై సీఎం చేసిన ప్రకటనలకు, విద్యాశాఖ చర్యలకు మధ్య సమన్వయం లేదని పేర్కొన్నారు. ఒకవైపు ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఉండదని ప్రకటిస్తే, మరుసటి రోజే ఇంటర్ బోర్డు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించిందని గుర్తుచేశారు. జూనియర్ కళాశాలలు ప్రారంభమై వారం రోజులు గడిచినా.. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇప్పటికీ అఫిలియేషన్లు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రభుత్వం గందరగోళంగా మార్చిందని విమర్శించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఒకరకమైన కోర్సులను సిఫార్సు చేస్తే, కమిషనరేట్ మరోరకమైన కోర్సులను సూచించిందని.. అయితే వాటిలో ఏ ఒక్కదానికి కూడా విశ్వవిద్యాలయాలు ఆమోదం ఇవ్వలేదని తెలిపారు. అయినప్పటికీ దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ