ఇది మీకు చివరి టీ20 ప్రపంచ కప్ అవుతుందా? అన్న ప్రశ్నకు లైవ్‌లో రిపోర్టర్‌పై విరుచుకుపడ్డ హర్మన్‌ప్రీత్ కౌర్

الاثنين، 8 يونيو 2026

Harmanpreet Kaur lashes out at a reporter during a live interaction over the question sports video of the incident is currently going viral on social media Will this be your last T20 World Cup?

t f B! P L

సీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందే టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వార్తల్లో నిలిచారు. టోర్నమెంట్‌లో పాల్గొనే జట్ల కెప్టెన్లందరితో నిర్వహించిన అధికారిక మీడియా సమావేశంలో హర్మన్‌ప్రీత్ కౌర్ , ఓ మహిళా రిపోర్టర్ మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రిపోర్టర్ అడిగిన రిటైర్మెంట్ ప్రశ్నకు హర్మన్‌ప్రీత్ కౌర్ ఘాటుగా సమాధానం ఇవ్వడమే ఇందుకు కారణం. మీడియా సమావేశం సందర్భంగా ఓ రిపోర్టర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ఉద్దేశించి "హర్మన్‌ప్రీత్ కౌర్ ఇది మీకు చివరి టీ20 ప్రపంచ కప్ అవుతుందా? దీనిపై మీరేమంటారు?" అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో ఒక్కసారిగా అసహనానికి గురైన హర్మన్‌ప్రీత్ కౌర్ "ఇది నా చివరి వరల్డ్ కప్ ఎందుకు అవుతుంది? నేనేమైనా రిటైర్ అయిపోవాలని మీరు కోరుకుంటున్నారా?" అంటూ హర్మన్‌ప్రీత్ ఎదురు ప్రశ్న వేశారు. దాంతో సదరు రిపోర్టర్ పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తూ "లేదు, నేను కేవలం తెలుసుకోవాలని అడిగాను. ఇది మీ చివరి ప్రపంచకప్ కాదని వినడం నాకు సంతోషంగా ఉంది" అని రిపోర్టర్ చెప్పారు. అయినప్పటికీ తగ్గని హర్మన్‌ప్రీత్ కౌర్ "మరి అలాంటప్పుడు అసలు ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు?" అంటూ నిలదీశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ