ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ “మేకప్ మంత్రి” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఎండలో తిరిగితే కేజీల కొద్దీ మేకప్ పడుతుందని, ఆ మేకప్‌తో గోడలకు పుట్టీ కూడా పెట్టుకోవచ్చంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోందని, అయితే అవి ఎక్కడ వస్తున్నాయో హోంమంత్రి ప్రజలకు వివరించాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. తాము చేసే రాజకీయ పోరాటం వేరని, అధికారంలో ఉండి చేసే వ్యవహారాలు తమకు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. తనపై విమర్శలు చేసే ముందు హోంమంత్రి ఆలోచించాలని అమర్నాథ్ సూచించారు. తాను గతంలో ఉపయోగించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్నే ప్రస్తుతం ఉపయోగిస్తున్నారని పేర్కొంటూ, అలాంటి పరిస్థితిలో తన గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. పదవి వచ్చిందని కొందరు గన్‌మెన్‌లతో తిరుగుతున్నారని, కానీ తమకు గన్‌మెన్‌ల అవసరం లేదని అమర్నాథ్ అన్నారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా వేలాది మంది పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారని పేర్కొన్నారు.

Post a Comment

Previous Post Next Post