పబ్‌లో అగ్నిప్రమాదం : ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు

Monday, June 15, 2026

crime Fire at Pub: Two Dead fire may have been caused by a short circuit or other factors karnataka resto-pub in Mysuru six injured

t f B! P L

కర్ణాటకలోని మైసూరులో రెస్టోపబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇద్దరు మృతి చెందగా, యజమానితో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు 26 ఏళ్ల సాహిన్ (డార్జిలింగ్), 24 ఏళ్ల ప్రకాశ్ (నేపాల్)గా గుర్తించారు. ప్రమాద సమయంలో పబ్‌లో ఉన్న వీరు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో గాయపడిన వారిలో వినియోగదారులు సోను, రమేశ్, మహదేవ్ ప్రసాద్, ప్రజ్వల్, అవినాష్‌తో పాటు పబ్ యజమాని ప్రీతమ్ పుమీత్ ఉన్నారు. వీరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో బార్‌లో 25 మందికి పైగా ఉన్నారని వర్గాలు తెలిపాయి. దట్టమైన పొగ భవనం అంతటా వేగంగా వ్యాపించడంతో చాలా మంది అందులో చిక్కుకుపోయారు. అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక దళం మండుతున్న భవనం నుంచి ఏడుగురిని విజయవంతంగా రక్షించింది.అయితే ప్రమాదం సంభవించే సమయానికి పబ్‌లో పలువురు ఉండటంతో కొంతసేపు భయాందోళనలు నెలకొన్నాయి. ఈ అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ లేదా ఇతర కారణాల వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ