దేశీయ మార్కెట్లోకి స్కోడా సరికొత్త 'కోడియాక్ ఆర్ఎస్' ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. దేశంలో ఐకానిక్ ‘ఆర్ఎస్’ బ్యాడ్జ్‌ను ధరించిన మొట్టమొదటి 7-సీటర్ లగ్జరీ కార్ ఇదే కావడం విశేషం. స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన స్కోడా కారుగా రికార్డు సృష్టించనుంది. గత ఏడాది విడుదలైన ఆక్టేవియా ఆర్ఎస్ కేవలం 20 నిమిషాల్లోనే అమ్ముడైపోయిన రికార్డును దృష్టిలో ఉంచుకుని, ఈ సరికొత్త కోడియాక్ ఆర్ఎస్ బుకింగ్‌లను 2026 జూన్ 22 నుండి ప్రారంభించేందుకు సంస్థ సర్వం సిద్ధం చేసింది. ఇది కేవలం వేగాన్ని మాత్రమే కాకుండా, ఏడుగురు ప్రయాణించడానికి వీలుగా అత్యంత విలాసవంతమైన సౌకర్యాన్ని, భద్రతను ఒకే ప్యాకేజీలో అందిస్తోంది. పనితీరు, ఇంజనీరింగ్‌కు మారుపేరైన ఈ ఎస్‌యూవీలో అత్యంత శక్తివంతమైన డ్రైవింగ్ అనుభూతిని ఇచ్చేలా స్కోడా తన రేసింగ్ డీఎన్‌ఏను జోడించింది. రోడ్లతో పాటు ఎలాంటి కఠినమైన రహదారులనైనా సులువుగా అధిగమించేందుకు వీలుగా దీనికి అడ్వాన్స్‌డ్ 4×4 ఆల్-టెర్రైన్ సామర్థ్యాన్ని కల్పించారు. ఇటీవల కోయంబత్తూర్‌లోని కోయాస్ట్ రేస్ ట్రాక్‌లో కైలాక్, కుషాక్, స్లావియా, ఆక్టేవియాలతో కలిసి స్కోడా కార్లు సాధించిన ‘ఇండియా మరియు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ ఈ బ్రాండ్ యొక్క ఇంజనీరింగ్ పరాక్రమాన్ని ఇప్పటికే నిరూపించింది. ప్రతి ఆకాంక్షకు తగినట్లుగా తన పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయాలనే వ్యూహంలో భాగంగానే స్కోడా ఈ లగ్జరీ విభాగంలోకి అడుగుపెట్టింది. డైనమిక్ సామర్థ్యం, పదునైన కచ్చితత్వం, మరియు అద్భుతమైన ఆఫ్-రోడింగ్ అనుభవాన్ని కోరుకునే భారతీయ వాహన ప్రియులకు ఈ కోడియాక్ ఆర్ఎస్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలవనుంది.
ホーム
/
technology
/
స్కోడా 'కోడియాక్ ఆర్ఎస్' ఎస్‌యూవీ విడుదల
الثلاثاء، 16 يونيو 2026
automobile business first 7-seater luxury car in the country open bookings for the new Kodiaq RS on June 22 Skoda 'Kodiaq RS' SUV Launched technology
ليست هناك تعليقات:
إرسال تعليق