హైదరాబాద్ లో అమాయక దంపతుల ఫ్లాట్‌ను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి, రూ.54 లక్షల బ్యాంకు రుణం పొందిన ప్రధాన నిందితుడు బానొత్ ప్రసాద్‌రావు (37)ను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన మేరకు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసాద్‌రావు లోన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. నిజాంపేట్ కు చెందిన మనోహర్ దంపతులకు రూ.25 లక్షలు ఇచ్చి వారి ఫ్లాట్ పత్రాలను తాకట్టు పెట్టుకున్నాడు. అనంతరం ఆస్తిని తన సంస్థ పేరిట మార్చి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పేరుతో బదిలీ చేసి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.54 లక్షల హోం లోన్ పొందాడు. జనవరి 2026లో బ్యాంకు రికవరీ సిబ్బంది బాధితుల వద్దకు రావడంతో మోసం బయటపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, జూన్ 19న ఖమ్మంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పేరుతో 54 లక్షల హోం లోన్ తీసుకున్న లోన్ ఏజెంట్ అరెస్ట్
الثلاثاء، 23 يونيو 2026
crime hyderabad Loan Agent Arrested for Securing ₹54 Lakh Home Loan Using Software Employee's Identity telangana
ليست هناك تعليقات:
إرسال تعليق